Home » » జూ ఎన్టీఆర్ కామిడీకోసం కుస్తీ పడుతున్న డైరెక్టర్..!?

జూ ఎన్టీఆర్ కామిడీకోసం కుస్తీ పడుతున్న డైరెక్టర్..!?



మార్చిలో జూ ఎన్టీఆర్, శ్రీనువైట్ల చిత్రం ప్రారంభం కానుంది. జూ ఎన్టీఆర్ హీరోగా నటుడు గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గత రెండు నెలలుగా ఈ స్రిప్ట్ మీద వర్క్ చేస్తున్న శ్రీనువైట్ల టోటల్ స్ర్కిప్ట్ ఎన్టీఆర్ కి వినిపించాడట. ఈ విషయంలో ఎన్టీఆర్ చాలా హ్యాపీగా ఉన్నాడని తెలుస్తోంది. యాక్షన్ అయినా, ఎంటర్ టైన్ మెంట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసే ఎన్టీఆర్ కి ఈ సబ్జెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతుందని శ్రీనువైట్ల చెప్తున్నాడు.

కాగా దూకుడు’ సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని తనకు కూడా కామెడీ కావాలని పట్టుబడుతున్నాడట ఎన్టీఆర్. ఇకపై ఏ సినిమా చేసినా, కామెడీకి ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. ‘ఊసరవెల్లి’లో కామెడీ లేకపోవడమే ఈ సినిమాకి హిట్ టాక్ రాకపోవడానికి కారణమని భావిస్తున్నాడట. దాంతో తను నటించబోయ శ్రీనువైట్ల కాంబినేషన్ చిత్రంలో కామెడీ కంపల్సరీ అని వైట్ల దగ్గర చెప్పడంతో కామెడీ సీన్లు పొందుపరచడానికి ఈ దర్శకుడు స్ర్కిప్ట్ తో కుస్తీ పడుతున్నాడని సమాచారం. మార్చిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. తమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి.
Share this article :
 
Copyright © Film News - All Rights Reserved
Proudly powered by Blogger