Home » , » Solo Story in Telugu leaked

Solo Story in Telugu leaked


 
బాణంతో పరిచయమైన నారా రోహిత్ హీరోగా రూపొందుతోన్న చిత్రం సోలో. ఈ చిత్రంలో హీరో ఓ అనాధ అని..అతను ప్రేమించిన అమ్మాయి (నిషా అగర్వాల్) తండ్రి ప్రకాష్ రాజ్ కు తన కూతుర్ని పెద్ద కుటుంబం లో ఇవ్వాలని ఉంటుందని,దాంతో అతను అనాధకి ఇవ్వనని నో చెప్తాడని స్టోరీలైన్ గా చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో వచ్చే ఓ పంచ్ డైలాగ్ ఇప్పుడు అంతటా ప్రశంసలు వినపడుతోంది. ఆ డైలాగు ఏమిటంటే...పోయేటప్పుడు నలుగురు లేకపోతే నా తప్పు కానీ, పుట్టే టప్పుడు నలుగురు లేకపోతే నా తప్పు ఎలా అవుతుంది సార్...ఈ డైలాగు ప్రకాష్ రాజ్, రోహిత్ ల మధ్య వస్తుందని చెప్తున్నారు. ఇక అప్పుడు ఈ డైలాగు హీరో చెప్తాడని,అప్పటినుంచి సోలో అతను ఆమెను ఎలా గెలుచుకున్నాడనేది మిగతా కథ అంటున్నారు.

యువత,ఆంజనేయులు చిత్రాలు రూపొందించిన పరుశురామ్ దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఓ లవ్ స్టోరీ అని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం కథ అమ్మాయి ఎవరో ఏంటో చూసుకోకుండా ప్రేమలో పడ్డ అబ్బాయికి ఆ తర్వాత పెద్దవాళ్ల ద్వారా సమస్యలు వస్తాయి. అప్పుడు హీరో తన ప్రేమ కోసం సోలో గా చేసే పోరాటమే చిత్ర కథాంశం. దర్శకుడు ఇదే విషయం చెపుతూ..ప్రేమ సమరంలో గెలవడానికి మా హీరో వేసిన ఎత్తులు ఎలాంటివో మా చిత్రంలో చూడాల్సిందే అంటున్నారు.
 

వంశీకృష్ణ శ్రీనివాస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పాటలు, కొంత టాకీ మినహా షూటింగ్ పూర్తయింది. నారా రోహిత్ సరసన నిషా అగర్వాల్‌ జంటగా నటిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ''ప్రేమ కోసం ఎలాంటి సాహసానికైనా సిద్ధపడే ఓ యువకుడి కథ ఇది. ఆ పాత్రలో నారా రోహిత్‌ ఇమిడిపోయారు. ఆయన నటన యువతకీ పెద్దవాళ్లకీ నచ్చుతుంద''న్నారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, సాయాజీషిండే, అలీ, ఎమ్మెస్‌నారాయణ, శ్రీనివాసరెడ్డి తదితరులు ఇతర పాత్రధారుల. సంగీతం: మణిశర్మ.
Share this article :
 
Copyright © Film News - All Rights Reserved
Proudly powered by Blogger