వచ్చే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తానని సినీహీరో నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. టాలీవుడ్ తరపున క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సాక్షి టివితో మాట్లాడారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తానని కూడా ఆయన చెప్పారు. ఒక ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన ఇప్పట్లో లేదన్నారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు.